ఉపకారికి నుపకారమ తెలుగు పద్యం (Upakariki nupakaramu Telugu padyamu)- Padyamulu/ padyalu

ఉపకారికి నుపకారమ తెలుగు పద్యం (Upakariki nupakaramu Telugu padyamu) - సుమతీ శతకం (Sumati Satakam)

పద్యం 4:

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ.!

తాత్పర్యం:

మేలు చేసినవారికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు. కీడు చేసిన వానికి కూడా, తప్పు తలంపక మేలు చేయువాడే నేర్పరితనము గలవాడు మరియు గొప్పవాడు.

In English:

Upakaariki nupakaaramu
vipareetamu gaadu seyu vivarimpanga
napakaariki nupakaaramu
nepamennaka seyuvaadu nerpari sumatee.!

Meaning of the poem (Tatparyam):

Helping who helped you is not a great thing!, but the man helping the people even who harms him is the great person!!

Comments